Madhu Yaskhi: కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే స్థానాల్లో పోలీసుల దాడులు: మధుయాష్కీ గౌడ్ ఆరోపణ

  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే దాడులు చేస్తున్నారన్న మధుయాష్కీ
  • పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి సోదాలు చేశారని ఆరోపణ
  • మూడ్రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించ లేదన్న మధుయాష్కీ
Madhu Yashki goud fires at police

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే స్థానాల్లో పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తామనే దాడులు జరుగుతున్నాయన్నారు. పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి సమయంలో తన ఇల్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించారన్నారు. తమను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులు బీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

పోలీసుల తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తాను మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించ లేదని వాపోయారు. తన నివాసం, కార్యాలయాల్లో అసలు తనిఖీయే జరగలేదని ఏసీపీ స్థాయి అధికారి చెప్పడం విడ్డూరమన్నారు. మరోవైపు ఎలాంటి ఆదేశాలు లేకుండా పోలీసులు వచ్చారని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారన్నారు. ఇలాంటి పోలీసులు ఉంటే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగవన్నారు. మధుయాష్కీ... సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

More Telugu News