బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఎప్పటికీ వారే ముఖ్యమంత్రులు: ఈటల రాజేందర్
- బీఆర్ఎస్ పార్టీకి బీసీలు, దళితులు, గిరిజనులను సీఎం చేసే దమ్ముందా? అని ప్రశ్న
- బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తే కోపం ఎందుకని నిలదీత
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్రకులాల వారే ముఖ్యమంత్రి అవుతారన్న ఈటల
పదేళ్లవుతున్నా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ అనుమతి లేకుండా మంత్రులు ఏం చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. హరీశ్ రావే స్వయంగా పని చేయలేకపోతున్నారన్నారు. పదేళ్లైనా డబుల్ బెడ్రూం ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం... ఇప్పుడు గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇస్తామంటే నమ్మడం ఎలా? అని ప్రశ్నించారు. గాడిదలకు గడ్డి పెడితే... ఆవులు పాలిస్తాయా? అని కేసీఆర్ చెప్పారని, ఇది నిజమేనని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఏమీ రాదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తామన్నారు.