బాబా చేతిలో చెప్పు దెబ్బలు తిన్న కాంగ్రెస్ అభ్యర్థి.. వీడియో ఇదిగో!
- మధ్యప్రదేశ్ ఎన్నికల్లో రత్లాం నుంచి బరిలో నిలిచిన పరాస్ సాక్లేచా
- ఫకీర్ బాబాకు కొత్త చెప్పులు ఇచ్చి కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
- ఆయనతో చెప్పు దెబ్బలు తింటే విజయం సాధిస్తామని నమ్మకం
వాటిని తీసుకున్న బాబా.. పరాస్ నెత్తిపై చెడామడా వాయించాడు. ఆపై వాటితో చెంపలు చెళ్లుమనిపించాడు. ఆయన కొడుతున్నంతసేపు పరాస్ ఆనందంతో పరవశించిపోయారు. ఆయనతో చెప్పు దెబ్బలు తింటే ఎన్నికల్లో విజయం తథ్యమనే ఉద్దేశంతోనే ఆయనిలా చేశారు. చూడాలి మరి.. చెప్పు దెబ్బలకు ఓట్లు రాలుతాయో? లేదో? ఈ వీడియోను మీరూ చూడండి!