PassWord: ఈ పాస్‌వర్డ్‌లలో మీది కూడా ఉంటే వెంటనే మార్చుకోండి!

  • ఇండియాలో అందరూ వాడే కామన్‌పాస్‌వర్డ్ ‘123456’
  • ప్రపంచంలో మూడోవంతు మంది పాస్‌వర్డ్ పూర్తిగా వరుస నంబర్లే
  • ‘నార్డ్‌పాస్’ తాజా నివేదికలో వెల్లడి
Most Common Password In India Is NordPass Study Says

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఒకే గోల పెడుతుంటారు కానీ దానికి అసలు కారణం ఏంటో తెలుసా? బలహీన పాస్‌వర్డ్‌లు. అవును.. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది కామన్‌గా ఉపయోగించే పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? ‘123456’. నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ కంపెనీ ‘నార్డ్‌పాస్‘ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ ఏడాది ‘123456’ అనేది భారత్‌లో కామన్ పాస్‌వర్డ్‌గా మారిందని తెలిపింది. అంతేకాదు, ప్రపంచంలోని మూడోవంతు (31శాతం) పాప్యులర్ పాస్‌వర్డ్‌లలో ‘123456789’, ‘12345’, ‘00000’ వంటి పూర్తిగా వరుస నంబర్లే ఉన్నట్టు నివేదిక వివరించింది.

ఇంటర్నెట్ యూజర్లు కూడా తమ ప్రాంతాలను సూచించే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నారట. వీటిలో ‘India@123’ అనే దానిని అత్యధికమంది ఉపయోగిస్తున్నారు. ‘barceelona’ అనేది స్పెయిన్‌లో ట్రెండింగ్‌లో ఉంటే, గ్రీస్‌లో ‘kalamata’ అనేది చాలా కామన్ పాస్‌వర్డ్‌గా మారింది. ప్రజలు తమ స్ట్రీమింగ్ ఖాతాలకు అత్యంత బలహీన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటున్నట్టు నార్డ్‌పాస్ సీటీవో థామస్ స్మాలకీస్ తెలిపారు.

More Telugu News