Animal: 'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో 'యానిమల్' ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • డిసెంబర్ 1న విడుదల కానున్న 'యానిమల్' 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • 'అన్ స్టాపబుల్' వేదికగా సాగిన సందడి 
  • ఈ నెల 24వ తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్

Animal movie update

'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో ఇటీవల 'భగవంత్ కేసరి' టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినిమాతోనే ఈ సీజన్ మొదలు కావడం ఆయన అభిమానులను ఖుషీ చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ 'యానిమల్' టీమ్ ఈ వేదికపై సందడి చేయనుంది. రీసెంటుగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగు జరిగింది.రణ్ బీర్ కపూర్ .. రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను రూపొందించాడు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను, డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో టీమ్ పాల్గొంది. అందుకు సంబంధించిన ఫొటోలు 'ఆహా' నుంచి రావడంతో, ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. 'యానిమల్' సినిమా టీమ్ పాల్గొన్న ఎపిసోడ్ ను ఈ నెల 24వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, 'ఆహా' వారు ఒక ప్రోమోను వదిలారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అనిల్ కపూర్ .. బాబీ డియోల్ .. సురేశ్ ఒబెరాయ్ .. శక్తి కపూర్ .. ప్రేమ్ చోప్రా వంటి సీనియర్ స్టార్స్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. 

More Telugu News