Vande Mataram: అపురూప దృశ్యానికి వేదికైన వాంఖడే స్టేడియం.. వైరల్ వీడియో ఇదిగో!

  • మ్యాచ్ జరుగుతుండగా జాతీయ గీతాన్ని ఆలపించిన 32 వేల మంది ప్రేక్షకులు
  • స్టేడియంలో ఉద్విగ్న క్షణాలు
  • ‘మా తుఝే సలామ్’ గీతంతో హోరెత్తిన స్టేడియం
Wankhede erupts as over 32000 fans sing Vande Mataram

ప్రపంచకప్‌లో భాగంగా నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కోహ్లీ అత్యద్భుత ప్రపంచ రికార్డులతోపాటు మరో ఉద్విగ్న ఘటనకు వాంఖడే వేదికైంది. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోని వేలాదిమంది ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు.

ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలామ్’ పాట స్టేడియంలో వినిపించగానే మ్యాచ్ చూస్తున్న 32 వేలమందికిపైగా ప్రేక్షకులు కూడా పెదవి కలిపారు. ముక్తకంఠంతో గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ ఉద్విగ్నభరిత క్షణాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News