షమీ దెబ్బకు ఓటమి అంచున న్యూజిలాండ్!

new zealand inching closer to defeat
  • వరుసగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
  • 43వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో గ్లెన్ ఔట్
  • 44వ ఓవర్‌లో చాప్‌మన్ వికెట్ తీసిన కుల్దీప్ 
  • ఆ తరువాత మిచెల్‌ను పెవిలియన్ బాట పట్టించిన షమీ
వరుసగా వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. దూకుడుగా ఆడుతున్న గ్లెన్ ఫిలిప్స్ స్పీడుకు తొలుత బుమ్రా 43వ ఓవర్‌లో బ్రేకులు వేశాడు. గ్లెన్ జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 33 బంతుల్లో 41 పరుగులు చేసి భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో అతడు పెవిలియన్ బాటపట్టడంతో న్యూజిలాండ్‌కు మరో కీలక భాగస్వామ్యం దూరమైంది. పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్న కుల్దీప్ 44వ ఓవర్‌లో చాప్‌మన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. న్యూజిలాండ్‌ కోసం పోరాడుతున్న మిచెల్ కూడా చివరకు ఔటయ్యాడు. షమీ 45.2 ఓవర్లో షమీ వేసిన బంతికి జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో షమీ ఈ మ్యాచ్‌లో కూడా ఐదు వికెట్లు తీసినట్టైంది. దీంతో, వరుసగా వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 47 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ స్కోరు 313/7 గా ఉంది.
Go Back to Shorts
Ind Vs NZ

More Telugu News