Babar Azam: కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ గుడ్ బై!

వరల్డ్ కప్‌లో ఘోరంగా విఫలమైన పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

‘‘నేను అన్ని ఫార్మాట్ల నుంచీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ, ఈ నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఆటగాడిగా మూడు ఫార్మాట్లలోనూ(టీ20, వన్డే, టెస్టు) పాక్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కు, జట్టుకు మద్దతు ఇస్తాను. నా మీద నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు పాక్ క్రికెట్ బోర్డుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని బాబర్ ఆజమ్ చెప్పుకొచ్చాడు. 
Babar Azam
Pakistan
India
Cricket

More Telugu News