కేసీఆర్ రెండుచోట్ల, కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారు: కిషన్ రెడ్డి
- నామినేషన్ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు
- గజ్వేల్లో 114 మంది బాధితులు, కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ వేశారన్న కిషన్ రెడ్డి
- నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ
- బీజేపీ బీసీలకు 39 టిక్కెట్లు ఇస్తే... కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 23 మందికే ఇచ్చాయన్న కిషన్ రెడ్డి
బీజేపీ తరఫున 39 మంది బీసీలు బరిలో ఉన్నారని, కానీ కాంగ్రెస్ నుంచి 22 మంది బీసీలు, బీఆర్ఎస్ నుంచి 23 మంది బీసీలు మాత్రమే పోటీ చేస్తున్నారన్నారు. బీసీల గురించి ఆలోచించేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. అందుకే కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయారన్నారు. కేసీఆర్ రెండుచోట్లా ఓడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్తో పాటు కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారన్నారు. కేసీఆర్ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి గెలిపించాలని చూస్తోందని మండిపడ్డారు.