Madhu Yaskhi: ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు

Police and Election flying squad checks in congress leader Madhu Yashki house
  • హయత్‌నగర్‌లోని మధుయాష్కీ ఇంట్లో సోదాలు
  • పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్తంగా దాడి
  • బీఆర్ఎస్ ఒత్తిడితోనే చేస్తున్నారన్న మధుయాష్కీ
  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్న కాంగ్రెస్ నేత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎల్బీనగర్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధుయాష్కిగౌడ్ ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు చేయడం కలకలం రేపింది. హయత్‌నగర్ వినాయకనగర్‌లోని ఆయన తాత్కాలిక నివాసంలో గత అర్ధరాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు కలిసి సోదాలు చేశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ అనుచరులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

తనిఖీల పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఒత్తిడితో తనిఖీల పేరుతో పోలీసులు తన ఇంట్లోకి చొరబడ్డారని మధుయాష్కీగౌడ్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ సోదాలపై పోలీసులు స్పందించారు. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వచేసి, డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడం వల్లే తనిఖీలు నిర్వహించినట్టు వివరణ ఇచ్చారు.
Madhu Yaskhi
Congress
Telangana
EC
Police

More Telugu News