సినీనటి నమిత భర్త వీరేంద్ర చౌదరికి నోటీసులు.. కారణం ఇదే!
- తమిళనాడు ఎంఎస్ఎంఈ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ జరిగిన మోసం కేసులో సమన్లు
- విచారణకు హాజరుకావాలని కోరిన పోలీసులు
- గోపాల్‌స్వామి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు
ముత్తురామన్ అనే వ్యక్తి ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. కానీ ఆ పదవిని వీరేంద్ర చౌదరి ఇటీవలే చేపట్టడంతో గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ముత్తురామన్‌తోపాటు కౌల్సిల్ తమిళనాడు డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ దుశ్యంత్ యాదవ్‌ను అక్టోబర్ 31న అరెస్ట్ చేశారు.