cec: అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల జారీ

  • ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందించాలని నోటీసులు
  • రేపు సాయంత్రం 5 గంటలలోపు పార్టీకి అందిన బాండ్స్ వివరాలు సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సూచన
  • సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్న ఎన్నికల సంఘం
EC notices to political parties on electoral bonds

కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. తమకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందించాలని ఈసీ ఈ నోటీసులు అందించింది. రేపు సాయంత్రం ఐదు గంటలలోపు పార్టీకి అందిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సీల్డ్ కవర్‌లో అందించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులకు నోటీసులు పంపించింది. ఈ నెల 2వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.  

తనిఖీల్లో రూ.571 కోట్లకు పైగా స్వాధీనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... తనిఖీలలో ఇప్పటి వరకు మొత్తం రూ.571.80 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఇరవై నాలుగు గంటల్లోనే స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.12.88 కోట్లుగా ఉంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

More Telugu News