Amit Shah: 18న ఒకేరోజు నాలుగు బహిరంగ సభలలో పాల్గొననున్న అమిత్ షా

Amit Shah to tour in telangana on 18
  • 18వ తేదీన సోమాజిగూడలోని మీడియా సెంటర్‌లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల
  • నల్గొండ, గద్వాల, వరంగల్, రాజేంద్ర నగర్ సభలలో పాల్గొననున్న అమిత్ షా
  • తొలుత 17న పర్యటించాల్సి ఉండగా... వాయిదా పడిన హోంమంత్రి పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అదే రోజున సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 18కి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News