Tickets: ఈ నెల 23న విశాఖలో టీమిండియా-ఆసీస్ టీ20 మ్యాచ్... రేపటి నుంచి టికెట్ల అమ్మకం

Ticket sales for 1st T20 match between Team India and Australia will commence from tomorrow
  • వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా, ఆసీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • తొలి మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యం
  • రేపు, ఎల్లుండి ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం
  • ఈ నెల 17, 18 తేదీల్లో ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకం
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. నవంబరు 23 నుంచి డిసెంబరు 3 వరకు వివిధ వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబరు 23న జరిగే తొలి టీ20 మ్యాచ్ కు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో, నవంబరు 15, 16 తేదీల్లో ఆన్ లైన్ లో 10 వేల టికెట్లు విక్రయించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి పేటీఎంలో టికెట్లు అందుబాటులో  ఉంటాయి. నవంబరు 17, 18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11 వేల టికెట్లు విక్రయించనున్నారు.
Tickets
1st T20
Visakhapatnam
Team India
Australia

More Telugu News