Devara: అల్యూమినియం ఫ్యాక్టరీకి చేరుకున్న 'దేవర'

  • షూటింగు దశలో ఉన్న  ఎన్టీఆర్ 'దేవర'
  • అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు వారాల షూటింగు
  • ప్రధాన పాత్రల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • ఏప్రిల్ 5వ తేదీన మొదటి భాగం విడుదల   

Devara Movie Update

ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'దేవర' సినిమాపైనే ఉంది. ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదు .. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ ప్లాన్ చేశారు. రెండు వారాల పాటు ఇక్కడే చిత్రీకరణ కొనసాగుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. ఆ తరువాత షెడ్యుల్ లో పాటలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. సైఫ్ అలీ ఖాన్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

More Telugu News