Bigg Boss: ప్రియాంక .. శోభా శెట్టిపై అందుకే రివర్స్ అయ్యాను: బిగ్ బాస్ భోలే షావలి

Bhole Shavali Interview
  • బిగ్ బాస్ నుంచి వచ్చేసిన భోలే షావలి 
  • తాను మాట జారడం గురించిన ప్రస్తావన
  • ప్రియాంక - శోభ తీరు గురించిన వివరణ 
  • అంతలోనే బయటికి వచ్చానంటూ అసంతృప్తి 

బిగ్ బాస్ హౌస్ నుంచి క్రితం వారం భోలే షావలి బయటికి వచ్చాడు. 'పాటబిడ్డ'గా తనని తాను పరిచయం చేసుకున్న భోలే షావలి, తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రియాంక - శోభా శెట్టి గురించి ప్రస్తావించాడు. "ప్రియాంక - శోభా ఇద్దరూ కూడా నా మీద గలగలమంటూ అరవడం జరిగింది. నేను మాట్లాడేటప్పుడు ఒక బూతు మాట వస్తే సారీ చెప్పాను కూడా" అన్నాడు.


"అయితే నేను సారీ చెప్పిన తరువాత కూడా వాళ్లు దానిని తీసుకోలేదు. అప్పుడు నేను రివర్స్ అయ్యాను. తప్పు చేయడం మానవ సహజం .. మీరు కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తారు .. నాకు సారీ చెబుతారు అన్నాను. అన్నట్టుగానే వాళ్లు నోరు జారారు .. తప్పు చేశారు .. నాకు సారీ చెప్పారు" అన్నాడు. 

"హౌస్ లో మంచి పేరు తెచ్చుకున్నావని నాగ్ సార్ నన్ను అన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. వాళ్లిద్దరూ కూడా రెడ్ జోన్ వరకూ వెళ్లారు. అప్పుడు వాళ్లు అసలు విషయాన్ని గ్రహించారు. తమ మాట తీరు అక్కడి వరకూ తీసుకువెళ్లిందనే విషయాన్ని గమనించారు. ఇక నేను పాటలు పక్కన పెట్టి గట్టిగా ఆడాలనుకున్న సమయంలోనే బయటికి వచ్చేశాను" అని చెప్పాడు.

  • Loading...

More Telugu News