Rohit Sharma: ఫాక్స్ స్పోర్ట్స్ చానల్ దీ అదే తీరు... రోహిత్ శర్మకు నో ప్లేస్

Fox Sports announces world cup team without Rohit Sharma
  • వరల్డ్ కప్ డ్రీమ్ టీమ్ ను ఎంపిక చేసిన ఫాక్స్ స్పోర్ట్స్
  • జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ
  • షమీని 12వ ఆటగాడిగా పేర్కొన్న క్రీడా చానల్
  • ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా రోహిత్ లేకుండానే జట్టు ఎంపిక
మొన్నటికి మొన్న వరల్డ్ కప్ టీమ్ ను ఎంపిక చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా)... అందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను విస్మరించింది. ఆ టీమ్ కు రోహిత్ శర్మ స్థానంలో విరాట్ కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఇప్పుడదే బాటలో ప్రముఖ క్రీడా చానల్ ఫాక్స్ స్పోర్ట్స్ కూడా నడిచింది. రోహిత్ శర్మ లేకుండానే వరల్డ్ కప్ టీమ్ ను ఎంపిక చేసింది. 

ఫాక్స్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు, ముగ్గురు ఆసీస్ క్రికెటర్లు, ఇద్దరు సఫారీ క్రికెటర్లు, ఒక న్యూజిలాండ్ క్రికెటర్, ఒక శ్రీలంక క్రికెటర్, ఒక ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ కు ఈ డ్రీమ్ టీమ్ లో స్థానం కల్పించారు. 

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... ఈ జట్టుకు కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. అంతేకాదు, టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన టీమిండియా పేస్ గన్ మహ్మద్ షమీని 12వ ఆటగాడిగా పేర్కొన్నారు.

ఫాక్స్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ టీమ్...

జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, రవీంద్ర జడేజా, మార్కో యన్సెన్, ఆడమ్ జంపా, దిల్షన్ మధుశంక, మహ్మద్ షమీ (12వ ఆటగాడు).
Rohit Sharma
World Cup Team
Fox Sports
Team India
World Cup

More Telugu News