Payal: 'మంగళవారం'పై క్రేజ్ గట్టిగానే కనిపిస్తుందే!

  • విలేజ్ నేపథ్యంలో సాగే 'మంగళవారం'
  • హాట్ లుక్స్ తో ఆకట్టుకోనున్న పాయల్ 
  • ఆమె కెరియర్ కి కలిసొచ్చే రోల్ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్ 

Mangalavaram Movie Update

పాయల్ రాజ్ పుత్ ప్రధానమైన పాత్రగా అజయ్ భూపతి 'మంగళవారం' సినిమాను రూపొందించాడు. స్వాతి - సురేశ్ వర్మ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో పాటు 'స్పార్క్' .. 'సప్తసాగరాలు దాటి' సినిమాలు విడుదల కానున్నాయి. అయితే 'మంగళవారం'పై ఎక్కువ బజ్ కనిపిస్తోంది. 

'RX 100' సినిమాలో పాయల్ గ్లామర్ ను అజయ్ భూపతి ఒక రేంజ్ లో చూపించాడు. ఈ సినిమాలోనూ పాయల్ ను ఆయన హాట్ గానే చూపించనున్నాడు. కోరికలను అదుపుచేసుకోలేని పాత్రలో ఆమె ఈ సినిమాలో కనిపించనుండటం ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది.

గ్రామీణ నేపథ్యంలోని మూఢనమ్మకాలు .. ప్రతి మంగళవారం ఎవరో ఒకరు అనుమానాస్పదంగా చనిపోవడం .. అక్కడి రాజకీయాలు .. చాటుమాటు శృంగారాలు ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా పాయల్ కెరియర్ కి మరింత ఊతాన్ని ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News