Manifesto: ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం

  • ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
  • ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటు
  • కమిటీలో ఇరు పార్టీల నుంచి ముగ్గురేసి చొప్పున సభ్యులు
  • నేడు తుది మేనిఫెస్టో రూపకల్పనపై కీలక చర్చ
TDP and Janasena joint manifesto committee held meeting at NTR Bhavan in Mangalagiri

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో, ఉమ్మడి మేనిఫెస్టో రూపాందించాలని ఇరు పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇటీవలే ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ (టీడీపీ ప్రధాన కార్యాలయం)లో సమావేశమైంది. 

టీడీపీ తరఫున ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. 

సంక్షేమంతో కూడిన అభివృద్ధి అజెండాగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఈ కమిటీ కృషి చేయనుంది. టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని అంశాలు ఉండగా, వాటికి అదనంగా మరికొన్ని అంశాలు జోడించి తుది మేనిఫెస్టోను రూపొందించనున్నారు.

More Telugu News