నాంపల్లి అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan responds on Nampally fire accident
  • అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి
  • బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్న పవన్ 
  • భవనాలలో రసాయనాలు, ఇంధనాలు నిల్వచేయడం వల్ల ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలిసిందని వ్యాఖ్య
  • నివాస ప్రాంతాల్లో ప్రమాదానికి ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వచేయకుండా కఠినంగా వ్యవహరించాలని సూచన
నాంపల్లి అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో బాధితులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు. గాయాలపాలైన వారికి, అస్వస్థతకు గురైనవారికి మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు. భవనాలలో రసాయనాలు, ఇంధనాలు నిల్వ చేయడం వల్ల ఈ ఘోరం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం ఉందని, నివాస ప్రాంతాల్లో ప్రమాదానికి ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Fire Accident
Telangana Assembly Election

More Telugu News