Jio AirFiber: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని పట్టణాలకు జియో ఎయిర్ ఫైబర్

  • వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఎయిర్ ఫైబర్ తీసుకువచ్చిన జియో
  • దేశంలోని 115 పట్టణాలకు విస్తరణ
  • ఇంటర్నెట్ తో పాటు టీవీ చానళ్లు, ఓటీటీ యాప్ లు లభ్యం
Jio AirFiber extends more cities and towns

మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం రిలయన్స్ జియో 'జియో ఎయిర్ ఫైబర్' ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇది 5జీ సాంకేతికతతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సర్వీసు. తాజాగా, దేశంలోని మరో 115 నగరాలు/పట్టణాలకు జియో ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మరిన్ని పట్టణాల్లో ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి వస్తోంది. 

ఏపీలో... నెల్లూరు, కడప, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు పట్టణాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందించాలని రిలయన్స్ నిర్ణయించింది.

తెలంగాణలో... పెద్దపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, ఆర్మూరు, తాండూరు, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, సిద్ధిపేట, కొత్తగూడెం, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం, పాల్వంచ, మిర్యాలగూడ, నిజామాబాద్, నిర్మల్ పట్టణాలకు జియో ఎయిర్ ఫైబర్ ను విస్తరించారు. 

జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు రూ.599 నుంచి, జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లు రూ.1499 నుంచి ప్రారంభం అవుతాయి. జియో ఎయిర్ ఫైబర్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే 16కి పైగా ఓటీటీ యాప్ లు, 550కి పైగా డిజిటల్ టీవీ చానళ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. 

తాజాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, , ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలకు కూడా జియో ఎయిర్ ఫైబర్ ను విస్తరించారు.

More Telugu News