Whatsapp: వాట్సాప్ గ్రూప్ ల చికాకుల నుంచి ఇలా తప్పించుకోండి!

  • వేర్వేరు గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేయకుండా అడ్డుకోవచ్చు
  • వాట్సాప్ లోని ప్రైవసీ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే చాలు
  • గ్రూప్ లో చేర్చే ప్రయత్నంచేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది.. చేరాలో వద్దో మీరే నిర్ణయించుకోవచ్చు
Whatsapp Tip for group joining

వాట్సాప్ గ్రూప్.. బంధువులు, మిత్రులను అందరినీ ఒకేసారి పలకరించడానికో, సరదాగా అందరూ కబుర్లు చెప్పుకోవడానికో ఉపయోగపడే ఫీచర్. అయితే, కొంతమంది దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. తమ కాంటాక్ట్ లలో ఉన్న వారిని తమకు నచ్చిన గ్రూప్ లలో జాయిన్ చేస్తున్నారు. వారి ఇష్టాయిష్టాలను గుర్తించకుండా గ్రూప్ లో చేర్చుతున్నారు. ఫలితంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్రూప్ లో ఉండలేక, ఎగ్జిట్ అయితే ఏమనుకుంటారోననే మొహమాటంతో కొనసాగుతుంటారు. ఇదంతా చికాకు కలిగించే వ్యవహారం.. ఏదో ఒక సందర్భంలో చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. 

ఇలాంటి ఇబ్బందిని ఓ చిన్న సెట్టింగ్ తో తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్ లోని సెట్టింగ్స్ లో ప్రైవసీ ఆప్షన్ ఎంచుకుంటే ఎవరు పడితే వారు మిమ్మల్ని గ్రూప్ లలో జాయిన్ చేయలేరని అంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని ఓ గ్రూప్ లో చేర్చే ప్రయత్నం చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందని, అందులోనే సదరు గ్రూప్ కు సంబంధించిన లింక్ ఉంటుందని చెప్పారు. ఆ గ్రూప్ లో చేరాలనుకుంటే లింక్ ద్వారా జాయిన్ కావొచ్చని, వద్దనుకుంటే లింక్ జోలికి వెళ్లకుంటే సరిపోతుందని వివరించారు.

ఈ ఫీచర్ ను సెట్ చేసుకోవడం ఇలా..

  • వాట్సాప్ ఓపెన్ చేసి కుడిపైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయండి
  • సెట్టింగ్స్ లో ప్రైవసీని సెలక్ట్ చేసి గ్రూప్స్ ఆప్షన్ ను ఓపెన్ చేయాలి
  • గ్రూప్స్ లో ‘ఎవ్రీవన్’ ను మినహాయించి ‘మై కాంటాక్ట్స్’, ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ ఆప్షన్లను ఎంచుకోవాలి

More Telugu News