Team India: టాపార్డర్ కు బ్యాటింగ్ ప్రాక్టీసు... భారీ స్కోరు దిశగా టీమిండియా

  • వరల్డ్ కప్ లో నేడు చివరి లీగ్ మ్యాచ్
  • బెంగళూరులో టీమిండియా × నెదర్లాండ్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
  • 32 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసిన టీమిండియా
Team India eyes on huge total against Nederlands

బెంగళూరులో నెదర్లాండ్స్ జట్టుతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ ఎంచక్కా బ్యాటింగ్ ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (61), శుభ్ మాన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. 

రోహిత్, గిల్ జోడీ తొలి వికెట్ కు 100 పరుగులు జోడించి శుభారంభం అందించారు. హిట్ మ్యాన్ 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టగా, గిల్ 3 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. కోహ్లీ మొదట్లో నిదానంగా ఆడినా ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. అయితే రోహిత్, గిల్, కోహ్లీ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న కాసేపటికే అవుట్ కావడం గమనార్హం.

 ప్రస్తుతం టీమిండియా స్కోరు 32 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు. శ్రేయాస్ అయ్యర్ 41, కేఎల్ రాహుల్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. డచ్ బౌలర్లలో వాన్ మీకెరెన్ 1, వాన్ డెర్ మెర్వ్ 1, బాస్ డీ లీడ్ 1 వికెట్ తీశారు.

More Telugu News