Rajinikanth: దీపావళి వేళ 'లాల్ సలాం' టీజర్ విడుదల... సీరియస్ లుక్ తో రజనీకాంత్

  • రజనీకాంత్ ప్రత్యేకపాత్రలో లాల్ సలాం
  • ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చిత్రం
  • వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న లాల్ సలాం
Rajinikanth starring Lal Salaam teaser released

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం లాల్ సలాం. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం లీడర్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా లాల్ సలాం చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇందులో రజనీకాంత్ సీరియస్ లుక్ తో కనిపించారు. ఈ సినిమాలో విష్ణువిశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు.

క్రికెట్ తో సంబంధం ఉన్న ఇతివృత్తంతో లాల్ సలాం చిత్రం రూపుదిద్దుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రజనీకాంత్ తో పాటు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా ఓ అతిథిపాత్రలో కనువిందు చేయనున్నారు. 

ఈ చిత్ర కథ విషయానికొస్తే... ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఎన్నో మ‌తాలు, కులాల వాళ్లు ఇక్క‌డ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు.  అయితే కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మ‌న‌లో మ‌న‌కు గొడ‌వ‌లు పెట్టారు. దీని వ‌ల్ల న‌ష్టం జ‌రిగింది. అయితే ఇలాంటి చెడు ప‌రిమాణాల నుంచి ప్ర‌జ‌ల‌ను, దేశాల‌ను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్‌. 

మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా స‌ర్దుబాటు చేశారు... ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త‌ను కుదిర్చార‌నేది తెలుసుకోవాలంటే ‘లాల్ స‌లామ్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధులు.

మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ జీవించారని మేకర్స్ చెబుతున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రానున్న సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ముంబై వంటి సున్నితమైన ప్రాంతంలో హిందువులు, ముస్లింల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ప్పుడు జ‌రిగిన న‌ష్టం ఏంటి? క‌్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్ద‌రు యువ‌కులు... వారిలో ఒక‌రు హిందు, మ‌రొక‌రు ముస్లిం. ఇద్ద‌రి మ‌న‌సుల్లో మ‌తపూరిత ద్వేషం ఉండ‌టంతో క్రికెట్ ఆట‌లో ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డే స‌న్నివేశాలు, దాని వ‌ల్ల  వారిద్ద‌రూ మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డే స‌న్నివేశాల‌ను చూడొచ్చు. 

ఆట‌లో మ‌తాన్ని చేర్చారు... అంతే కాకుండా పిల్ల‌ల మ‌న‌సుల్లో విషాన్ని నింపారు అని అక్క‌డున్న పెద్ద‌ల‌ను మొయిద్దీన్ పాత్ర నిలదీయడాన్ని టీజర్ లో చూడొచ్చు. అలాగే హిందు, ముస్లింలు గొడ‌వ ప‌డుతున్న‌ప్పుడు.. మొయిద్దీన్ భాయ్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశార‌నే క‌థాంశంతో ‘లాల్ స‌లాం’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజ‌ర్ చూస్తుంటే అర్థమ‌వుతుంది. 

ఎప్ప‌టిలాగానే సూప‌ర్ స్టార్ రజినీకాంత్ త‌న‌దైన స్టైలింగ్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకోనున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ యువ క్రికెట‌ర్స్‌గా అలరించబోతున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. 

ఈ చిత్రంలో జీవితా రాజశేఖర్, జీవితా రాజశేఖర్, సెంథిల్, తంబి రామ‌య్య‌, అనంతిక‌, వివేక్ ప్ర‌స‌న్న‌, తంగ దురై త‌దిత‌రులు న‌టించారు. రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండడం మరో ప్రధాన ఆకర్షణ.

More Telugu News