Pakistan: సొంత జట్టు ఇజ్జత్ తీసిన పాక్ మాజీ దిగ్గజాలు వసీం అక్రం, షోయబ్ మాలిక్

  • ఆఫ్ఘన్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న పాకిస్థాన్
  • తమ జట్టు కంటే ఆఫ్ఘనిస్థాన్ జట్టు బలంగా కనిపించిందన్న మాజీలు
  • బాబర్ ఆజం జట్టు కంటే బాగా ఆడిందంటూ ప్రశంసలు
Pak legends Wasim Akram and Shoaib Malik Praised Afghan Team

ప్రపంచకప్‌లో దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటికి బయలుదేరిన పాకిస్థాన్ జట్టుపై ఆ జట్టు మాజీ క్రికెటర్లు వసీం అక్రం, షోయబ్ మాలిక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కంటే ఆఫ్ఘనిస్థాన్ చాలా బాగా ఆడిందని ప్రశంసించారు. ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచుల్లో ఐదింటిలో ఓడిన బాబర్ ఆజం జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆఫ్ఘనిస్థాన్ చేతిలో 8 వికెట్లతో ఓడిపోవడం కూడా పాక్ సెమీస్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. 

మాలిక్ మాట్లాడుతూ.. తమ కంటే కూడా ఆఫ్ఘనిస్థాన్ బాగా ఆడిందని ప్రశంసించాడు. వసీం అక్రం కూడా ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ చాలా బలంగా కనిపించిందని పేర్కొన్నాడు. ఇంకో విషయం ఏమిటంటే.. తమ జట్టు తీరికలేకుండా క్రికెట్ ఆడుతుండడం వల్ల కుర్రాళ్లు కొంత అలసిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా ఆఫ్ఘన్ జట్టు బాగా ఆడిందని కొనియాడాడు.

More Telugu News