రోడ్డుపై పాదచారులు, సైక్లిస్టుల భద్రత కోసం కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థకు ప్రతిపాదనలు
- వాహనాల్లో ‘మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ ఏర్పాటుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదన
- ఎమ్2, ఎమ్3, ఎన్2, ఎన్3 కేటగిరీల వాహనాల్లో ఏర్పాటు చేయాలని సూచన
- పాదచారులు సమీపంలో ఉన్నప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేయనున్న సిస్టం
- ప్రమాదం జరిగే అవకాశం ఉంటే డ్రైవర్‌కు హెచ్చరికలు
అంతేకాకుండా, ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ తరువాత నిబంధనలను నోటిఫై చేస్తామని రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. ఎమ్2, ఎమ్3, ఎన్2, ఎన్3 కేటగిరీల వాహనాల్లో (బస్సులు, ట్రక్కులు) ఈ వ్యవస్థను అమర్చుతారు. రోడ్డు ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న పాదచారులు, సైక్లిస్టుల (వల్నరబుల్ రోడ్ యూజర్స్) భద్రత కోసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.