విద్యుత్ స్తంభం ఎక్కిన యువతి... దిగమని ప్రధాని మోదీ పదేపదే విజ్ఞప్తి

  • పరేడ్ మైదానంలో మాదిగల విశ్వరూప బహిరంగ సభ
  • మోదీ మాట్లాడుతుండగా స్తంభం ఎక్కిన యువతి
  • సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ-ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువతి సభలో ఏర్పాటు చేసిన ఓ విద్యుత్ స్తంభాన్ని ఎక్కి కలకలం రేపారు. అలా చేయవద్దని, విద్యుత్ స్తంభం దిగమని ప్రధాని మోదీ పలుమార్లు ఆమెకు విజ్ఞప్తి చేశారు. అక్కడున్న విద్యుత్ సిబ్బంది కలుగజేసుకొని ఆమెను కిందకు దించాలని ప్రధాని కోరారు. ఆమె వెంటనే కిందకు దిగాలని, ఆమెకు ఉన్న సమస్యను పరిష్కరిస్తానని మోదీ హామీ ఇచ్చారు.

Manda Krishna Madiga
Narendra Modi
MRPS
Telangana Assembly Election

More Telugu News