chandramohan: చంద్రమోహన్ మృతిపై చిరంజీవి స్పందన

Megastar chiranjeevi condolence to chandramohan family
  • వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్న మెగస్టార్
  • ప్రాణం ఖరీదు సినిమాతో పరిచయమయ్యారని వెల్లడి
  • చంద్రమోహన్ తో తనకు గొప్ప అనుబంధం ఉందన్న చిరు

వైవిధ్య నటనా కౌశలం ద్వారా చంద్రమోహన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయన ఇకలేరని తెలవడం విషాదకరమని అన్నారు. తన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’తో తామిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది స్నేహంగా మారి గొప్ప అనుబంధం నెలకొందని వివరించారు. ఆ సినిమాలో ఆయన మూగవాడి పాత్రలో అత్యద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. చంద్రమోహన్ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మెగస్టార్ చెప్పారు.

'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి చిత్రాలలో చంద్రమోహన్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారని మెగస్టార్ చిరంజీవి చెప్పారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. చంద్రమోహన్ కుటుంబానికి, ఆయన అభిమానులకు మెగస్టార్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News