Brush Vesko: "హే మామా బ్రష్షే వేస్కో.. మైండంతా రిఫ్రెష్ చేస్కో..."  నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి హుషారైన పాట విడుదల

  • నితిన్, శ్రీలీల జంటగా ఎక్స్ ట్రా... ఆర్డినరీ మ్యాన్
  • వక్కంతం వంశీ దర్శకత్వంలో చిత్రం
  • హ్యారిస్ జయరాజ్ సంగీతం
New song from Nithiin Extra Ordinary Man movie out now

నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ ట్రా... ఆర్డినరీ మ్యాన్. తాజాగా ఈ చిత్రం నుంచి హే మామా బ్రష్షే వేస్కో... మైండంతా రిఫ్రెష్ చేస్కో అంటూ సాగే హుషారైన సాంగ్ విడుదలైంది. హ్యారిస్ జయరాజ్ తన ట్రేడ్ మార్క్ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్ర నరేశ్, హైపర్ ఆది, హరితేజ, పృథ్వీ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన 'డేంజర్ పిల్లా' అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్టయింది.

More Telugu News