Madhavan: భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో వస్తున్న 'ది రైల్వే మెన్' సిరీస్!

  • నెట్ ఫ్లిక్స్ కి  'ది రైల్వే మెన్'
  • వేలాదిమందిని బలిగొన్న దుర్ఘటన నేపథ్యం   
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న జుహీ చావ్లా 
  • ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్
The Railway Men Web Series Update

1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనను ఇప్పటికీ కూడా చాలామంది మరిచిపోలేదు. వేలాదిమంది మరణించిన ఆ భయంకరమైన సంఘటనను గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఆ కాళరాత్రి నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఆ వెబ్ సిరీస్ పేరే 'ది రైల్వే మెన్'. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను భారీ బడ్జెట్ లో నిర్మించారు. మాధవన్ .. జుహీ చావ్లా .. మందిరాబేడీ ... బాబిల్ ఖాన్ ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు. సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ పాత్రలో మాధవన్ నటించగా, స్టేషన్ మాస్టర్ పాత్రలో కేకే మీనన్ .. లోకో పైలట్ గా బాబిల్ ఖాన్ కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. భారీ తారాగణంతో .. కుతూహలాన్ని రేకెత్తించే కంటెంట్ తో రూపొందిన ఈ సిరీస్ పట్ల చాలామంది ఉత్కంఠను కనబరుస్తున్నారు. ఆ నాటి ఆ సంఘటనకి ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆవిష్కరిస్తుందనేది చూడాలి. 

More Telugu News