తన ఇంటిపై ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారంటే..!
- కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందన్న పొంగులేటి
- సోదాల్లో ఐటీ అధికారులకు ఏమీ దొరకలేదని వెల్లడి
- కుట్రపూరితంగా తనపై ఐటీ దాడులు నిర్వహించారని ఆరోపణ
- హైదరాబాద్ రావాలని కుటుంబ సభ్యులకు ఐటీ అధికారుల సూచన
ఉదయం ఐదు గంటల నుంచి ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను, సిబ్బందిని విడివిడిగా విచారించారు. మరోవైపు, పొంగులేటి ఇంటి ముందు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు. ఉపేందర్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుడి ప్రయత్నాన్ని తోటి కార్యకర్తలు అడ్డుకున్నారు.