అదే సమయంలో నా వైవాహిక జీవితం ముగిసిపోయింది: సమంత

Samantha on her personal issues
  • ఆరోగ్యం దెబ్బతినడం తన పనిపై ప్రభావం చూపిందన్న సమంత
  • దీని కారణంగా తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని వెల్లడి
  • పలు సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయని ఆవేదన
అగ్రసినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆమె భూటాన్ లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ చికిత్స తీసుకుంటున్నారు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఈ చికిత్సను తీసుకుంటారు. మరోవైపు తాజగా హార్పర్స్ బజార్ అనే అనే మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు.

తాను ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నానని... అదే సమయంలో తన వైవాహిక జీవితం ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం దెబ్బతినడం తన పని మీద ప్రభావం చూపిందని చెప్పారు. దీని కారణంగా తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. ఇవన్నీ తన జీవితంలో బాధాకరమైనవని చెప్పారు. పలు సమస్యలు తనను ఒక్కసారిగా చుట్టుముట్టాయని తెలిపారు.

ఒకవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు మానసిక సంఘర్షణకు గురవుతున్న సమయంలో... ఆరోగ్య సమస్యలకు గురైన వారి గురించి, ట్రోలింగ్స్ గురించి ఆందోళనకు గురైన వారి గురించిన కథనాలను చదివానని చెప్పారు. వాళ్లు ఇబ్బందుల నుంచి బయటపడిన కథనాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని తెలిపారు. తన శక్తి మేరకు తాను పోరాడుతున్నానని.. ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయంలో పోరాడే శక్తి ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు.
Go Back to Shorts
Samantha
Tollywood

More Telugu News