Nara Lokesh: ఏపీకి జగన్ ఎందుకు కావాలి?: నారా లోకేశ్

Nara Lokesh asks Why AP needs Jagan
  • వై ఎపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ కార్యక్రమం
  • నేటి నుంచి కార్యక్రమం షురూ
  • జగన్ ఎందుకు కావాలని ప్రజలు కూడా అదే అడుగుతున్నారంటూ లోకేశ్ వ్యంగ్యం
ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలంటూ వైసీపీ నేటి నుంచి 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమాన్ని షురూ చేసింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వై ఏపీ నీడ్స్ జగన్? అంటూ తిరిగి ప్రశ్నించారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలి? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సరిగ్గా ఇదే అడుగుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుని, ధ్వంసం చేసిన జగన్ ను ఏపీ ఎందుకు కావాలనుకుంటుంది? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

జీరో వాడకం... రూ.295 బిల్లు అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపైనా లోకేశ్ స్పందించారు. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్? అంటూ ఎత్తిపొడిచారు. "వాహ్... ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంటు బిల్లు బాదుడు. సొంత పేపరు, చానల్, సిమెంటు, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకు రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం" అంటూ ధ్వజమెత్తారు.
Nara Lokesh
Why AP Needs Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News