KTR: ప్రచార రథం నుంచి పడిపోయిన కేటీఆర్, సురేశ్ రెడ్డి, జీవన్ రెడ్డి

KTR fell down from prachara ratham
  • ఆర్మూరులో ప్రచారం నిర్వహిస్తుండగా ఘటన
  • డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడిపోయిన నేతలు
  • కేటీఆర్ కింద పడకుండా పట్టుకున్న గన్ మెన్లు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్మూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రథం నుంచి ఆయన ముందుకు పడ్డారు. ఇదే సమయంలో వాహనంపై నుంచి సురేశ్ రెడ్డి, జీవన్ రెడ్డి నేలపై పడ్డారు. కేటీఆర్ కిండ పడకుండా ఆయన గన్ మెన్లు ఆయనను గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. 

జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఓపెన్ టాప్ వాహనంపై వీరు ప్రయాణస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వారంతా అదుపు తప్పి ముందుకు పడిపోయారు. ఈ సంర్భంగా వాహనంపై ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో వారు ముందుకు పడిపోయారు. అయితే ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 
KTR
BRS
Prachara Ratham
accident

More Telugu News