Pawan Kalyan: ప్రధాని మోదీ ఈ దేశానికి అవసరం: పవన్ కల్యాణ్

Modi is a visionary leader says Pawan Kalyan
  • మోదీ ఒక విజనరీ లీడర్ అన్న పవన్
  • దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించగల సమర్థులు అని కితాబు
  • బీజేపీకి, ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు. దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని, వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలరని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల సమర్థులు అని అన్నారు. మోదీ విజన్ 2047 సాకారమయ్యేందుకు బీజేపీకి, ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు బీజేపీ 8 స్థానాలకు కేటాయించింది. తమ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫామ్ లను కూడా అందించారు.
Pawan Kalyan
Janasena
Narendra Modi
BJP

More Telugu News