దశాబ్దాలపాటు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?: కేటీఆర్
- కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశాలు ఇస్తే చేసిందేమీ లేదన్న కేటీఆర్
- కాంగ్రెస్ కావాలో... కరెంట్ కావాలో ప్రజలు ఆలోచించాలని సూచన
- 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు ఉద్దరిస్తామంటోందని విమర్శ
దశాబ్దాలపాటు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు అక్కడి రైతులు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంట్ కోసం రైతులు విద్యుత్ స్టేషన్లలో మొసళ్లు వదిలే పరిస్థితి వచ్చిందన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ఉద్దరిస్తామని తిరుగుతున్నారని మండిపడ్డారు.