ఈ నెల 11వ తేదీన మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ
- నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి హైదరాబాద్కు ప్రధాని
- పరేడ్ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని
- అదే రోజు తిరిగి ఢిల్లీకి పయనం
ఈ నెల 11న సాయంత్రం గం.4.45 నిమిషాలకు మోదీ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. గం.5కు రోడ్డు మార్గంలో పరేడ్ మైదానంకు చేరుకుంటారు. గం.5 నుంచి గం.5.45 వరకు పరేడ్ మైదానంలో సభలో ఆయన ప్రసంగిస్తారు. మోదీ గం.5.55 నిమిషాలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గం.6కు బేగంపేట నుంచి ఢిల్లీకి చేరుకుంటారు.