David Warner: మ్యాచ్ మధ్యలో వార్నర్-రషీద్‌ఖాన్ మధ్య వాగ్వివాదం

  • ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన రషీద్‌ఖాన్-వార్నర్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు 
  • ఐపీఎల్‌లో ఇద్దరూ ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం
Heated Exchange Between Rashid Khan And David Warner

ప్రపంచకప్‌లో భాగంగా గతరాత్రి ఆఫ్ఘనిస్థాన్‌-ఆస్ట్రేలియా మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. తొలుత ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ మైదానంలో విధ్వంసం సృష్టించి లాగేసుకున్నాడు. మ్యాక్సీ వన్‌మ్యాన్ షోగా మారిపోయిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్‌ఖాన్ మధ్య మైదానంలో వాగ్వివాదం జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్మేట్స్ అయిన ఇద్దరూ గొడవకు దిగారు. ఇద్దరూ అరుచుకోవడంతో ఏం జరుగుతోందోనని అభిమానులు కంగారుపడ్డారు. అయితే, ఆ తర్వాత వారిద్దరూ ఎవరిదారిన వారు వెళ్లిపోవడంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌వైపు మొగ్గింది. అయితే, మ్యాక్స్‌వెల్ దిగాక మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడమే కాదు.. అజేయ డబుల్ సెంచరీ (201) సాధించి అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

More Telugu News