ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యారు: కేటీఆర్ విమర్శలు
- పొరపాటున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శలు
- రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో చూడాలన్న కేటీఆర్
- కేసీఆర్‌ను కొట్టేందుకు మోదీ సహా ఢిల్లీ నేతలు వరుస కడుతున్నారన్న మంత్రి
సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ మైగ్రేషన్... కానీ ఇప్పుడు మహబూబ్‌నగర్ అంటే ఇరిగేషన్ అన్నారు. 14.50 లక్షల ఎకరాలకు పాలమూరులో నీరు అందుతోందన్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారని.. 15 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, అమిత్ షా, నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు అంతా తెలంగాణకు క్యూ కడుతున్నారన్నారు. కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది తెలంగాణకు రావాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సింహంలా సింగిల్‌గా వస్తారన్నారు.