కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడు: పొంగులేటి
- ఇందిరమ్మ రాజ్యం కోసం చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలన్న పొంగులేటి
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి
- దోచుకున్న వందల కోట్ల డబ్బుతో ఓడించాలని చూస్తున్నారని ఆరోపణ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని, రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, భూమిలేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం రూ.12 వేలు ఇస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కలలు కన్నారని, కానీ వారి కలలను బీఆర్ఎస్ కల్లలు చేసిందన్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. దోచుకున్న డబ్బుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమను ఓడించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.