Kanna Lakshminarayana: ఈసారి గెలిస్తే రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు: జగన్ పై కన్నా ఫైర్

Jagan is thinking of selling AP to KCR says Kanna Lakshminarayana
  • జగన్ వల్ల ఇప్పటికే ఆస్తులు పోయాయన్న కన్నా
  • 2019లో మోసం చేసి గెలిచారని విమర్శ
  • ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి గెలవాలనుకుంటున్నారని వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వల్ల ఇప్పటికే హైదరాబాద్ లో మన ఆస్తులు పోయాయని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఏపీని కేసీఆర్ కు అమ్మేద్దామని జగన్ చూస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి జగన్ గెలిచారని చెప్పారు. తమనే కాకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని కూడా జగన్ మోసం చేశారనే విషయాన్ని ప్రజలు గమనించారనే... ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. 

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణకు నీరు వెళ్తోందని... అయినా జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్జీ రంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఆయన విగ్రహం వద్ద టీడీపీ నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కన్నా పైవ్యాఖ్యలు చేశారు.  

  • Loading...

More Telugu News