cpm: కోదాడ, మునుగోడు, ఇల్లందులకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం

CPM announces Kodad Munugod ellandu candidates
  • కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు... మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి... ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ పోటీ
  • మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన తమ్మినేని వీరభద్రం
  • ఇప్పటికే 16 మంది అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం మంగళవారం మరో మూడు స్థానాలలో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ, మునుగోడు, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణకు టిక్కెట్లు కేటాయించింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను, ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. తమ్మినేని సీతారాం పాలేరు నుంచి బరిలో ఉంటున్నారు.
cpm
Tammineni veerabhadram
Telangana Assembly Election

More Telugu News