BJP: 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

Telangana BJP Releases 4th List With 12 Candidates
  • నాలుగు విడతలుగా 100 మంది అభ్యర్థుల ప్రకటన
  • మునుగోడు నుంచి బరిలోకి చలమల కృష్ణారెడ్డి
  • చెన్నూరు నుంచి దుర్గం అశోక్.. సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి బరిలోకి
అభ్యర్థుల జాబితా ప్రకటనలో బాగా వెనకబడిన తెలంగాణ బీజేపీ తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ప్రకటించిన మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించగా, తాజా జాబితాలో మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది.

అభ్యర్థులు వీరే..
బీజేపీ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం.. చెన్నూరు నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నుంచి సుభాష్‌రెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమ, హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్‌కుమార్, కొడంగల్ నుంచి బంటు రమేశ్‌కుమార్, గద్వాల నుంచి బోయ శివ, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాస్, మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి, నకిరేకల్ నుంచి మొగులయ్య, ములుగు నుంచి అజ్మీర ప్రహ్లాద్ నాయక్ బరిలోకి దిగుతున్నారు.
BJP
Telangana
Telangana Assembly Election

More Telugu News