Chandrababu: ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో ఆపరేషన్

Chandrababu reaches LV Prasad hospital
  • కాసేపట్లో చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్
  • ఇప్పటికే ఏఐజీ ఆసుపత్రిలో వివిధ పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు
  • నిన్న చర్మ సంబంధిత చికిత్స చేయించుకున్నట్టు సమాచారం
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించనున్నారు. ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిన్న ఆయనకు వివిధ వైద్య పరీక్షలతో పాటు, చర్మ సంబంధిత చికిత్సను కూడా అందించినట్టు తెలుస్తోంది. 

Chandrababu
Telugudesam

More Telugu News