Chhattisgarh: చత్తీస్‌గఢ్ ఎన్నికలు.. నక్సల్స్ ఐఈడీ పేలుడులో విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవానుకు గాయాలు

  • చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్
  • పోలింగ్ ప్రారంభమైన గంటలోనే పేలుడు
  • నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలువేయడంతో ఘటన
CRPF Jawan On Election Duty Injured In IED Blast

చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత జవాను సీఆర్‌పీఎఫ్ కోబ్రా 206వ బెటాలియన్‌కు చెందిన ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్ అని అధికారులు తెలిపారు. 

నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నేడు ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది.

More Telugu News