CM Jagan: డిసెంబరు 1 నుంచి మంచి ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి: సీఎం జగన్

  • జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
  • జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం
  • హెల్త్ క్యాంపుల్లో గుర్తించిన రోగులకు పూర్తి స్థాయిలో చేయూతనివ్వాలని సూచన
CM Jagan video conference with district collectors on Jagananna Arogya Suraksha

ఏపీ సీఎం జగన్ 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం చాలా ముఖ్యమైనదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. శిబిరాల్లో గుర్తించిన రోగులకు పూర్తి స్థాయిలో చేయూతనివ్వాలని పేర్కొన్నారు. అర్బన్ లో 91 శాతం, గ్రామాల్లో 94.94 శాతం స్క్రీనింగ్ పూర్తి చేశామని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు చేయడం పూర్తయిందని తెలిపారు. డిసెంబరు 1 నుంచి మంచి ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం జగన్ వివరించారు. జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

More Telugu News