KCR: పువ్వాడ పువ్వులు కావాలో, తుమ్మ ముళ్లు కావాలో తేల్చుకోండి: ఖమ్మంలో కేసీఆర్

  • ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
  • పువ్వాడ అజయ్ ని మరోసారి గెలిపించాలని పిలుపు
  • మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని వెల్లడి
  • తుమ్మలు, తుప్పలకు ఓటేస్తే ముళ్లు గుచ్చుకుంటాయని పరోక్ష వ్యాఖ్యలు
kCR speech in Khammam

సీఎం కేసీఆర్ ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. మంచి చెడు ఆలోచించి ఓటేయాలని ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పువ్వాడ అజయ్ ని గెలిపిస్తే ప్రజలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని, అలా కాదని తుమ్మలు (తుమ్మల  నాగేశ్వరరావు), తుప్పలు తెచ్చుకుంటే ముళ్లు గుచ్చుకునేది మీకే అని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ పువ్వులు కావాలో, తుమ్మ ముళ్లు కావాలో తేల్చుకోండి అని స్పష్టం చేశారు. 

పువ్వాడ అజయ్ పట్టుబట్టి తనతో రూ.700 కోట్లు మంజూరు చేయించుకున్నాడని, ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని కేసీఆర్ వెల్లడించారు. ఖమ్మం పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని పువ్వాడ అజయ్ భావిస్తున్నాడని, దయచేసి అజయ్ ను మరోసారి గెలిపించాలని కోరారు. 

"ఖమ్మంలో ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు లేవు. ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఖమ్మం ఇప్పుడెంత భద్రంగా ఉందో చూడండి. ఖమ్మం అంటే ఆరు వరుసల రోడ్లు, గల్లీల్లో కూడా వైట్ టాప్ సిమెంట్ రోడ్లు, రోడ్ల పక్కన వెలుగులు విరజిమ్మే లైట్లు, పచ్చని చెట్లతో ఖమ్మం అలరారుతోంది. ఇదంతా ఏదో మంత్రం వేస్తే జరగలేదు. పువ్వాడ అజయ్ కష్టపడి పనిచేశాడు కాబట్టే ఇంత అభివృద్ధి జరిగింది" అని సీఎం కేసీఆర్ వివరించారు.

More Telugu News