హైదరాబాద్ ఆఫ్ మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించిన సచిన్
- గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్
- సచిన్‌తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా హాజరు
- ఉత్సాహంగా పాల్గొన్న 8 వేలమంది రన్నర్లు
ఈ మారథాన్‌లో వయసుతో పనిలేకుండా దాదాపు 8 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకే 21.1కే రన్ ప్రారంభం కాగా, ఆ తర్వాత 10కే, 5కే రన్ ప్రారంభమయ్యాయి. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమానికి దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించాడు.