medigadda: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన

  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించామన్న ఎల్ అండ్ టీ
  • ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
  • ఇప్పటి వరకు ఈ బ్యారేజీ ఐదు సీజన్లను ఎదుర్కొందని వెల్లడి
L and T announcment on Medigadda barriage issue

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన నేపథ్యంలో తాజాగా, ఎల్ అండ్ టీ కీలక ప్రకటన చేసింది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించామని, ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎల్ అండ్ టీ శనివారం ప్రకటించింది. ఆనకట్ట పునరుద్ధరణ పనులకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము ప్రభుత్వం డిజైన్, నాణ్యతా ప్రమాణాల ప్రకారం నిర్మించి 2019లో అప్పగించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటి వరకు ఐదు వరద సీజన్లను ఈ ప్రాజెక్టు ఎదుర్కొందని చెప్పింది. ఈ అంశాన్ని ప్రస్తుతం సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని, విచారణ, చర్చ దశల్లో ఉందని పేర్కొంది. తదుపరి కార్యాచరణపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చాక తాము దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

More Telugu News