మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించామన్న ఎల్ అండ్ టీ
- ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
- ఇప్పటి వరకు ఈ బ్యారేజీ ఐదు సీజన్లను ఎదుర్కొందని వెల్లడి
ఇప్పటి వరకు ఐదు వరద సీజన్లను ఈ ప్రాజెక్టు ఎదుర్కొందని చెప్పింది. ఈ అంశాన్ని ప్రస్తుతం సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని, విచారణ, చర్చ దశల్లో ఉందని పేర్కొంది. తదుపరి కార్యాచరణపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చాక తాము దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.